TG high court : కేఏ పాల్ పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కూల్చివేతలను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమంది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, హైడ్రాకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్‌లో G.O.99పై స్టే విధించాలని, కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు. తదుపరి విచారణ అక్టోబర్14న జరగనుంది.

ఇక, తెలంగాణ ప్రభుత్వం ఈఏడాది జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా నామకరణం చేసి హైడ్రా పరిధిలో చేర్చారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించి ముందుకు సాగుతుంది. హైడ్రా నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపడుతుంది. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *