Telangana gurukula: ఎస్సీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో అలుగు వర్షిణి వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.
Telangana gurukula: ఇటీవల ఎస్సీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి అలుగు వర్షిణి వ్యాఖ్యల ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్సీ గురుకులాల విద్యార్థులపై ఆమె చులకనగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ విద్యార్థులు అని చులకనగా మాట్లాడారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కమిషన్ స్పందించింది.
Telangana gurukula: అధికారి అలుగు వర్షిణి వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆలోగా ఇవ్వకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి ఇచ్చిన నోటీసుల్లో జాతీయ ఎస్సీ కమిషన్ హెచ్చరించింది. ఇప్పటికే ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ దుమారం రేపుతున్నాయి.