మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఆయా గ్రూపుల్లో మొత్తం 172 మంది మహిళలను గుర్తించి, వారికి గ్రూపుల వారీగా, విడివిడిగా బ్యాంకు అకౌంట్లు కూడా ఓపెన్ చేయించినట్లు సమాచారం. వ్యాపారం ఇతర వృత్తులు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలను అందించడానికి చర్యలు చేపడుతున్నారు.