Runamafi: సంక్రాతి తర్వాత రైతలు అకౌంట్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి.. కార్యచరణ రూపొందిస్తామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందన్నారు. ఎవ్వరికీ ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాపై మంత్రివర్గం ఉప సంఘం వేశామని గుర్తుచేశారు.
