Hyderabad: తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై వంద మార్కులకు పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ జరగనుంది. ఇంటర్నల్ మార్కులను పూర్తిగా ఎత్తివేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్ష జరగగా… 20 మార్కులు ఇంటర్నల్ కోసం కేటాయించారు.
అయితే సర్కార్ తాజా నిర్ణయంతో 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజును స్వీకరిస్తున్నారు. నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లిచుకోవచ్చు. మరోవైపు నిర్దేశించిన గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.