Telangana Cabinet: ఈ నెల 4న తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే విడతల వారీగా ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో కూడా ఏదో ఒక గ్యారెంటీ అమలుకు శ్రీకారం చుడుతుందని అందరూ భావిస్తున్నారు.
Telangana Cabinet: ఈ నెల 4న జరిగే తెలంగాన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యంగా రైతుభరోసా, భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఎస్సీ వర్గీకరణ అమలు తదితర పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం కూడా ఆయా అంశాలపై కొత్త సంవత్సర ఆరంభం నుంచి ప్రారంభిస్తామని చెప్పుకుంటూ వస్తున్నది. ఈ దశలో ఆయా అంశాలపై ప్రాధాన్యం సంతరించుకున్నది.