Mahesh Babu: మహేశ్ బాబు తో రాజమౌళి చేయబోతున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ప్రియాంక తొలి చిత్రం తెలుగులోనే ఆరంభం అయి ఆగిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుని ఆపై హాలీవుడ్ కి వెళ్లి ఇండో హాలీవుడ్ నటిగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత భాగం విశాఖ పట్నంకు సమీపంలోని బొర్రా గుహల్లో జరగనుంది. ఇంతకు ముందు ఈ సినిమా లొకేషన్ల వేటలో భాగంగా కెన్యా వెళ్ళి రెక్కి చేసి వచ్చిన రాజమౌళి బృదం అక్కడి అంబోసెలి నేషనల్ పార్క్ లొకేషన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పుడు గత శనివారం బొర్రా కేవ్స్ ను సందర్శించారు రాజమౌళి. రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో కొంత భాగాన్ని జూనియర్ ఎన్టీఆర్ తదితరులపై బొర్రా గుహలకు సమీపంలో చిత్రీకరించటం విశేషం. ఇక మహేశ్ బాబుతో రాజమౌళి తీయనున్న చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. ఇప్పటికే కీరవాణి కొన్ని ట్యూన్స్ ను కూడా సిద్ధం చేశారు. ఈ సినిమా షూటింగ్ ను సమ్మర్ లో ఆరంభించబోతున్నారు. 2027లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.