Telangana Cabinet Meeting:

Telangana Cabinet Meeting: మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్? జూలై 25న క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణ‌యం?

Telangana Cabinet Meeting: ఈ నెల (జూలై 25న‌) రాష్ట్ర మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్ అంద‌నున్నదా? ఆ రోజు జ‌ర‌గ‌నున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ స‌మావేశంలో ఆ హామీపై నిర్ణ‌యం జ‌ర‌గ‌న‌నున్న‌దా? స్థానిక ఎన్నిక‌ల ముంగిట రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ హామీ అమ‌లుకు శ్రీకారం చుట్ట‌నున్న‌దా? అంటే చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తున్న‌ది.

Telangana Cabinet Meeting: ఈ నెల 25న జ‌రిగే తెలంగాణ క్యాబినెట్ స‌మావేశంలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా 18 ఏళ్లు దాటిన మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2,500 చొప్పున అంద‌జేసే ప‌థ‌కం అమ‌లు చేసే అంశంపై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ మేర‌కు అన్ని విభాగాల నుంచి క్యాబినెట్ స‌మావేశానికి నివేదిక‌లు పంపాల‌ని సీఎస్ రామ‌కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

Telangana Cabinet Meeting: ఇదే క్యాబినెట్ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్ ఆర్డినెన్స్ పైనా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ద‌ని స‌మాచారం. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఆరు గ్యారెంటీల‌పై కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీల్లో భాగంగా అధికారంలోకి రాగానే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అమ‌లు చేసింది.

Telangana Cabinet Meeting: ఆ త‌ర్వాత 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తు స‌ర‌ఫ‌రాను అమ‌లు చేస్తున్నారు. ఆ త‌ర్వాత రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. తాజాగా మ‌హిళ‌ల‌కు రూ.2,500 అందించే ప‌థ‌కం అమ‌లుపై తాజాగా జ‌ర‌గ‌నున్న క్యాబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోన‌న్న‌ట్టు స‌మాచారం.

Telangana Cabinet Meeting: స్థానిక ఎన్నిక‌ల ముగిట‌ మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు రూ.2,500 ఇచ్చే ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రణాళిక‌లు వేస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ విష‌యం రాష్ట్రంలోని ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌ల‌కు గ‌ణ‌నీయ‌మైన ఆర్థిక భ‌రోసాను ఇవ్వ‌డంతోపాటు స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి అద‌న‌పు బ‌లాన్ని చేకూరుతుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *