Telangana BC Reservation Ordinance: బీసీ రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు, బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మంగళవారంమే (జూలై 15) రాష్ట్ర న్యాయశాఖ బీసీ ఆర్డినెన్స్ ముసాయిదా ఫైల్‌ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు పంపింది. ఆర్డినెన్స్ ఫైల్‌పై ఈరోజు (జూలై 16న) సంబంధిత అధికారులతో గవర్నర్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Telangana BC Reservation Ordinance: ఎటువంటి న్యాయ చిక్కులు ఎదురవకుండా ముసాయిదా డ్రాప్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 285 (ఏ) సెక్షన్‌లో సవరణ చేస్తూ రూపొందించిన ముసాయిదాను గవర్నర్‌కు పంపింది. ఎలాంటి చిక్కులు లేకుండా రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంటుంది.
Telangana BC Reservation Ordinance: ఒకవేళ రాష్ట్ర గవర్నర్ అభ్యంతరాలను వ్యక్తం చేసినా, తిరస్కరించినా.. స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో ఇటీవల హైకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువుపై ఆందోళన నెలకొనేలా ఉన్నది. మూడు నెలల్లోగా అంటే సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థానిక ఎన్నికలను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.
Telangana BC Reservation Ordinance: రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం జనగణనకు సిద్ధమవడంతో కేంద్రం వద్ద అది పెండింగ్‌లో పడింది. దీంతో జాప్యం అవుతుండటం, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్డినెన్స్ తెచ్చేందుకే ముందుకొచ్చింది.
Telangana BC Reservation Ordinance: ఈ దశలో ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదంపై నేడు, లేదా రేపటిలోగా తేలిపోనున్నది. ఇప్పటికే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార వర్గాలు సిద్ధం చేసి ఉంచాయి. ఆర్డినెన్స్ వచ్చేదే ఆలస్యం.. అన్నట్టుగా అంతా ఏర్పాట్లు జరిగిపోయాయి. రిజర్వేషన్లు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సిబ్బంది ఎంపిక, శిక్షణ అంతా రెడీ చేసి ఉంచింది.

