Telangana assembly:వాడీవేడిగా 11 రోజులపాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడ్డాయి. మార్చి 12 నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు గరంగరంగా సాగాయనడం అతిశయోక్తి లేదు. తొలి, మలి సమావేశాల కంటే ఈ సభలు కొంత ఉద్రిక్త వాతావరణంలో, తీవ్రమైన చర్చోపచర్చలు సాగినట్టు విశ్లేషకులే అంచనా వేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలతో సాగింది. ఒకటి రెండు విపరిణామాలు మినహాయిస్తే అంతా సవ్యంగానే సాగిందని చెప్పవచ్చు.
Telangana assembly:మార్చి 12న ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 11 రోజులు పాటు సాగగా, 12 బిల్లులను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మూడు తీర్మానాలు ఉభయసభలు ఆమోదించాయి. సభ ఆసాంతం 92 గంటల 32 నిమిషాల పాటు సాగింది. ఈ బిల్లుల్లో కీలకమైన బిల్లులు ఉండటం విశేషం. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్్ బిల్లులను కూడా ఇదే సెషన్‌లో ప్రవేశపెట్టడం గమనార్హం. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను విభజించాలనే కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందింది.
Telangana assembly:ఎంతోకాలంగా అధికార పక్షం డిమాండ్ చేస్తూ వస్తున్నా, ఈ సారి సమావేశాల్లో కూడా మాజీ సీఎం కేసీఆర్ ఒకరోజు మినహా హాజరుకాలేకపోయారు. కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఎందుకు రారు.. అంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. ఈ దశలో అంతే స్థాయిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్‌రావు, కేటీఆర్ తిప్పికొట్టగలిగారు.
Telangana assembly:బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అంశం తీవ్ర దుమారమే లేపింది. మలిరోజు జరిగిన సభలోనే ఆయనను సెషన్ మొత్తం హాజరుకాకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌పై అనుచితంగా పరవర్తించారని పేర్కొంటూ ఆయనపై వేటు వేయడంతో బీఆర్ఎస్ సభ్యులు రోజంతా నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌ను విన్నవించుకున్నా, ఆయనకు అనుమతి దక్కలేదు.
Telangana assembly:11 రోజులపాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య వాడీవేడిగా వాదోపవాదాలు జరిగాయి. ఉభయ సభల్లోనూ ఈ విధమైన ధోరణి కనిపించింది. గతంతో పోలిస్తే అధికార పక్షంపై, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరింత ఎదురుదాడి చేసింది. చివరిరోజైన గురువారం కూడా సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేస్థాయిలో ఆయన కూడా తిప్పికొట్టగలిగారు. దీంతో వీరిద్దరి చర్చలు ఆసక్తికరంగా మారాయి.