Telangana assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను ఒకేసారి ప్రవేశపెట్టింది. ఆయా బిల్లులను ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, తెలుగు వర్సిటీ పేరు మార్పు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిల్లులను చర్చకు పెట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చారిత్రక బిల్లులైన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టడంపై ఆయా వర్గాలు హర్షితిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
Telangana assembly: ఎస్సీ వర్గీకరణ, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరుగా మారుస్తూ మంత్రి దామోదరం రాజనర్సింహ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు.
Telangana assembly: ఆయా బిల్లుల్లో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి తొలుత చర్చను ప్రారంభించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణ సాహిత్యానికి విశేష సేవలందించారని, 350 మంది కవులను వెలుగులోకి తెచ్చారని కొనియాడారు. తాను కులాలకు వ్యతిరేకం కాదని, పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పెట్టుకుందామని, దానికి బీజేపీ సహకరించాలని సీఎం ప్రతిపాదించారు. అదే విధంగా బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి మాజీ సీఎం దివంగత రోషయ్య పేరు పెట్టుకుందామని, ఆయన విగ్రహం హైదరాబాద్‌లో నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.