Telangana assembly: అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సర్పంచులు పెండింగ్ బిల్లులో అంశంపై రసాభస నెలకొంది. హరీశ్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి నెలా గ్రామాలకు రూ.275 కోట్లు, పట్టణాలకు రూ.150 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, 691 కోట్ల పెండింగ్ బిల్లులు చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించకుండా సర్పంచులకు, ఎంపీటీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.
అయితే, శ్రీధర్ బాబు ఈ వాదనను పచ్చి అబద్ధంగా చెబుతూ, గత ప్రభుత్వం ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నప్పుడు కూడా, పంచాయతీలకు ఇచ్చే బడ్జెట్ పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల 2018 నుంచి ఉన్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సమస్యలు కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పుల బాధ్యత తీసుకొని వాటిని చెల్లిస్తుందని చెబుతూ, పంచాయతీలకు రూ.740 కోట్లు, ఉపాధి హామీ కింద రూ.450 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

