Telangana assembly:ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై కీలక పరిణామం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆదేశించారు. ఈ మేరకు విచారించిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.
Telangana assembly:ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలైన నలుగురిని స్పీకర్ విచారించారు. బీఆర్ఎస్ తరఫున కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయించారు. ఇరువర్గాల న్యాయవాదులతో ఈ విచారణ కొనసాగింది. ఈలోగా ఆ మూడు నెలల గడువు కూడా ముగిసింది. స్పీకర్ ఇంకా ఆరుగురిని విచారించలేకపోయారు. దీంతో మరో 8 వారాల గడువు కావాలంటూ స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
Telangana assembly:స్పీకర్ వినతి మేరకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలోనే మిగతా ఎమ్మెల్యేలను విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలైన డాక్టర్ సంజయ్‌కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్‌పై ఈ నెల (నవంబర్)లోనే విచారణ చేపట్టనున్నట్టు స్పీకర్ తెలిపారు. నవంబర్ 6, 7, 12, 13 తేదీల్లో ఈ విచారణ చేపట్టనున్నట్టు ఉత్తర్వులు విడుదలయ్యాయి.
Telangana assembly:మొదట పిటిషనర్లను విచారించిన తర్వాత.. ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్ఆనరు. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పీకర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ మిగిలి ఉన్నారు.

