Telangana assembly: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేవాలు ఈ నెల (మార్చి) రెండో వారంలో కొనసాగే అవకాశం ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 6న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు ఈ నెల 8 లేదా 10 నుంచి శాసనసభ సమావేశాలను ప్రారంభించి, ఏప్రిల్ 3 వరకు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.
Telangana assembly: ఈ సమావేశంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతోపాటు కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఆయా బిల్లులపై పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్రానికి నివేదించనున్నారు. ఆ తర్వాత కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.