Telangana: తెలంగాణలో పెండింగ్ బకాయిల కోసం ఒక్కొక్కటి చొప్పున వివిధ అసోసియన్లు సమ్మె బాట పడుతున్నాయి. మొన్న తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల అసోసియేషన్ కాలేజీల బంద్‌కు పిలుపునివ్వగా, పెండింగ్ బకాయిల్లో కొన్నింటిని నిధులను విడుదల చేయగా, బంద్‌ను ఉపసంహరించుకున్నారు. అదే బాటలో తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సెప్టెంబర్ 16న అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా అదే బాటలో రేషన్ డీలర్లు పయనమయ్యారు.
Telangana: పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రేషన్ డీలర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం (సెప్టెంబర్ 16) సమ్మె నోటీసులు ఇచ్చింది. ఈ లోగా తమ డిమాండ్లను పరిష్కరిస్తే సమ్మెను ఉపసంహరించుకుంటామని తేల్చి చెప్పింది.
Telangana: పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, కమీషన్ పెంచాలని, నెలనెలా రెమ్యునరేషన్ ఇవ్వాలని తదితర ఎన్నికల నాడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఇప్పటికే పలుమార్లు కోరినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.