Telangana: హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ చోరీ చేసిన నిందితుడిని సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్న సంచలన ఘటన శనివారం చోటుచేసుకున్నది. దుండగుడు చోరీ చేసిన అంబులెన్స్ నడుపుకుంటూ హైవేపై పరుగులు పెట్టించాడు. అంబులెన్స్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా దుండగుడు దొరకలేదు. 150 కిలోమీటర్ల దూరంలో పోలీసులు భారీ స్కెచ్ వేశాక అంబులెన్స్‌తో సహా దుండగుడిని పట్టుకున్న వైనం ఉత్కంఠగా కొనసాగింది.
Telangana: హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ పరిధిలో ఉన్న 108 అంబులెన్స్ వాహనాన్ని ఓ దొంగ చోరీ చేసి విజయవాడ వైపు జాతీయ రహదారిపై వేగంగా నడుపుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ సమాచారం చేరవేశారు. అయినా 150 కిలోమీటర్ల పరిధిలో ఆ దొంగ.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ, అతి వేగంతో నడుపుకుంటూ పోలీసులను ఎక్కడికక్కడ ఉరుకులు పరుగులు పెట్టించాడు.
Telangana: మార్గమధ్యంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం వద్ద ఎంతగా ప్రయత్నించినా ఆ దొంగను చిట్యాలలో పట్టుకోలేకపోయారు. పట్టుకునే క్రమంలో ఎదురుగా వెళ్లిన అక్కడి ఏఎస్ఐ జాన్‌రెడ్డిని వాహనంతో ఢీకొట్టి మరీ ఆ దొంగ పరారయ్యాడు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Telangana: విజయవాడ జాతీయ రహదారిపైనే వెళ్తుండగా, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌గేటు వద్ద అక్కడి సిబ్బంది సహాయంతో పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అక్కడా నిలువరించలేకపోయారు. టోల్‌గేటు వద్ద మూసి ఉంచిన గేట్‌ను ఢీకొట్టి మరీ వాహనంతో ఆ దుండగుడు దూసుకుపోయాడు.
Telangana: వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్లాన్ చేంజ్ చేశారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద మూసీ బ్రిడ్జి ఉన్నది. అక్కడ ఎలాగైనా పట్టేయాలని ఆ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్రిడ్జి దాటకు ముందే లారీలు పూర్తిగా అడ్డుగా పెట్టేశారు. ఇక మనోడు తప్పించుకోలేకపోయాడు. ఇక చేసేదేమీ లేక 108 అంబులెన్స్ వాహనాన్ని నిలిపేయాల్సి వచ్చింది. వచ్చీరాగానే పోలీసులు అప్రమత్తమై వాహనాన్ని, దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana: 108 వాహనాన్ని చోరీ చేసిన ఆ దుండగుడు ఎవరు? ఏ ప్రాంతం? ఎందుకు చేయాల్సి వచ్చింది? మతిస్థిమితం లేదా? దొంగతనం కోసం ఇలా చేశాడా? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దుండగుడు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు. క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నారు.