10th Class Exams: తెలంగాణలో 2026 మార్చిలో జరగనున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువులను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన వారందరికీ ఈ గడువులు వర్తిస్తాయని డీజీఈ (Directorate of Government Examinations) స్పష్టం చేసింది.
లేట్ ఫీజు లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు అక్టోబర్ 30, 2025 నుండి నవంబర్ 13, 2025 వరకు. పాఠశాల హెడ్ మాస్టర్లు (HMలు) విద్యార్థుల నుంచి సేకరించిన మొత్తాన్ని నవంబర్ 14లోపు ట్రెజరీకి సమర్పించాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు హెచ్ఎంలకు నవంబర్ 18 వరకు గడువు ఇవ్వబడింది.
లేట్ ఫీజు గడువులు:
-
రూ. 50 లేట్ ఫీజుతో: నవంబర్ 15 – నవంబర్ 25
-
రూ. 200 లేట్ ఫీజుతో: నవంబర్ 29 – డిసెంబర్ 12
-
రూ. 500 లేట్ ఫీజుతో: డిసెంబర్ 15 – డిసెంబర్ 29
డీజీఈ కార్యాలయం ఈ గడువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: ఎలిమినేషన్ కి ముందే బిగ్బాస్ నుంచి అయేషా ఔట్.. ఎందుకో తెలుసా..?
ఫీజు వివరాలు:
-
అన్ని సబ్జెక్టులకు: ₹125
-
మూడు సబ్జెక్టుల వరకు: ₹110
-
మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే: ₹110 + ప్రతి అదనపు సబ్జెక్టుకు ₹60
ఈ ఫీజు నిబంధనలు SSC / OSSC / వొకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తాయి. విద్యార్థులు గడువు లోపు ఫీజు చెల్లించకపోతే, లేట్ ఫీజుతోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు, పాఠశాలలు సమయానికి చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.