Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న రేపిన కలకలం ఇంకా చల్లారనేలేదు. తరచూ సొంత పార్టీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ ఇరుకున పెడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల వరంగల్‌లో జరిగిన సభలో రెండు సామాజిక వర్గాలపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కులగణన సర్వేను తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతోపాటు ఆ నివేదిక పత్రాన్ని కాల్చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. దానిపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణా సంఘం తీన్మార్ మల్లన్నకు నోటీస్ జారీ చేసింది.
Teenmar Mallanna: కులగణన సర్వే నివేదికను చెత్తబుట్టలో పడేయాలంటూ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఒకవైపు కులగణన సర్వేపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు హైప్ తెచ్చేందుక ప్రయత్నిస్తుంటే, మరోవైపు తీన్మార్ మల్లన్న వైఖరి వారికి తలనొప్పిగా మారింది. అందరూ మల్లన్న తీరును తప్పుబడుతూనే ఉన్నారు. ఆచితూచి మాట్లాడాలని మంత్రి పొన్నం చెప్పగా, ఇంతకూ మల్లన్న ఏ పార్టీయో ఆయనే చెప్పాలంటూ మంత్రి సీతక్క అన్నారు.
Teenmar Mallanna: ఈ నెల 12వ తేదీలోపు షోకాజ్ నోటీసులపై ఆలోచిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. బీసీ సంఘాల నేతలతో తాను చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీలోని కొందరు.. బీసీ నేతలను అణిచివేయాలని చూస్తున్నారని, పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సర్కార్‌ను తాను తప్పుపడతలేదని, సర్వే నివేదికనే తప్పు పడుతున్నట్టు చెప్పారు. కులగణనలో ఉన్న వారికి నోటీస్‌లు ఇవ్వాలని, తనకు కాదని చెప్పుకొచ్చారు.
Teenmar Mallanna: బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పయితే, యూపీఏ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు కదా? అని గుర్తు చేశారు. తానేమీ తప్పు మాట్లాడలేదని, కులగణన సర్వే తప్పొప్పులపై స్పందించానని తీన్మార్ మల్లన్న చెప్పారు.