Team India Sixers Record: బెంగళూరు టెస్టులో టీమిండియా ఎదురీదుతున్నా 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టు చేరని మరో మైలురాయి అందుకుంది. ఒక కేలండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Team India Sixers Record: 46 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కుదురుగా ఆడుతోంది. ఇలాంటి మ్యాచ్ లోనూ రోహిత్ సేన ఓ రికార్డు క్రియేట చేసింది. గతంలో ఒక కేలండర్ ఇయర్ లో 89 సిక్సర్లతో ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. 2022 కేలండర్ ఇయర్ లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించగా 2024 కేలండర్ ఇయర్ లో టీమిండియా ఆ రికార్డును అధిగమించింది. 102 సిక్సర్లతో కొత్త చరిత్ర సృష్టించింది. ఇక టీమిండియా బ్యాటర్లలో యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఈ ఏడాది టెస్టులలో ఏకంగా 29 సిక్సర్లు కొట్టడం విశేషం. అలాగే మరో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 16 సిక్సర్లు బాదాడు.
ఈ రికార్డు కూడా టీమిండియాదే !
Team India: న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో పోరాడుతోంది. ఇలా ఓ ఇన్నింగ్స్ లో వందలోపు ఆలౌటై మ్యాచ్ను డ్రా చేసుకున్న చరిత్ర టీమిండియాకు ఉంది. ఇప్పటిదాకా 5 సార్లు టీమిండియా వందలోపే స్కోరు చేసి మ్యాచ్ ను కాపాడుకుంది. అందులో ఇలా 3 సార్లు న్యూజిలాండ్ పైనే కావడం విశేషమే.
Team India: 1952లో ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ 6 వికెట్లకు 326 పరుగులతో డిక్లేర్ చేసింది. జవాబుగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 98 పరుగులకే ఆలౌటైంది. కానీ మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది. 1965లో ముంబయి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులు చేస్తే టీమిండియా 88 పరుగులకే ఆలౌటైంది. ఫాలో ఆన్ ఆడిన భారత్ 5 వికెట్లకు 463 పరుగులు చేసింది. కివీస్ 8 వికెట్లకు 80 పరుగులు చేసి బతికి బయటపడింది.
Team India: 1999 మొహాలీ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 83 పరుగులకే చుట్టేసింది. ద్రవిడ్, సచిన్ సెంచరీలతో సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 505 పరుగులు చేసి డ్రా చేసుకుంది. 1979 లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ పై 96 పరుగులకే ఆలౌటైంది. తర్వాత 4 వికెట్లకు 318 పరుగులు చేసి మ్యాచ్ డ్రా చేసింది. గుండప్ప విశ్వనాథ్, వెంగ్ సర్కార్ సెంచరీలతో గట్టెక్కించారు. 1969లో మన హైదరాబాద్ టెస్టులో 89 పరుగులకే టీమిండియా ఆలౌట్. రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ, వర్షం టీమిండియాను కాపాడింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరి తాజా టెస్టులో టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.