Women U-19 T20 WC:

Women U-19 T20 WC: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న టీమిండియా అమ్మాయిలు! సెమీస్ దాదాపు ఖాయమే…!

Women U-19 T20 WC: మహిళా అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా పోటీలో ఉన్న భారత జట్టు నాలుగో విజయాన్ని సాధించింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో సూపర్-6 దశలో తొలి మ్యాచ్‌లోనే గెలుపు నమోదు చేసింది. ఈ టోర్నీలో తదుపరి పోరు స్కాట్లాండ్‌తో జరగనుంది, అందులో గెలిస్తే సెమీఫైనల్స్‌కు చేరినట్లే..!

కౌలాలంపూర్, మలేషియాలో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించి, బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశారు. మొదటి ఐదుగురు బ్యాటర్లు వరుసగా 2, 2, 5, 5, 7 పరుగులు మాత్రమే చేశారు, దీంతో బంగ్లాదేశ్ 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ఈ క్షణంలో మవువా 14 పరుగులతో, సౌమాయా ఆక్తర్ 21 పరుగులతో కొంతవరకు వికెట్లకు అడ్డుకట్టను వేశారు. ఇలా బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు తీసింది, జోషిత, షబ్నామ్, త్రిష తలా ఒక వికెట్‌ చొప్పున పడగొట్టారు.

ఇది కూడా చదవండి: Ind vs Eng 3rd T20: నేడే మూడో టి20…! ఇంగ్లాండ్ పుంజుకుంటుందా లేదా భారత్ సిరీస్ కొట్టేస్తుందా..?

Women U-19 T20 WC: అనంతరం సులభమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిలు 43 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ గొంగడి త్రిష 31 బంతుల్లో 40 పరుగులు చేసి అద్భుతంగా రాణించింది. చివరకు భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.

ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచుల్లో గెలుపొందింది. మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను, ఆ తర్వాత మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లను ఓడించింది. సూపర్ సిక్స్‌లో భారత తదుపరి మ్యాచ్ జనవరి 28న స్కాట్లాండ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌తో భారత్ సూపర్-6లో తన చివరి మ్యాచ్‌ను ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా టాప్-4లో స్థానం పొంది సెమీ ఫైనల్స్ చేరుకుంటుంది..!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *