Nara Lokesh: ఈరోజు జరిగిన ఏపి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగులకు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 1998 డీఎస్సీ బాధితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దానికి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.
1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చామని, ఇంకా 600 ఖాళీలు ఉన్నాయని, త్వరలో వాటిని భర్తీ చేస్తామని తెలిపారు. లీగల్ సమస్యలు రాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు అని అన్నారు
ఇది కూడా చదవండి: AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్..