Amaravati: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ద్వారా భర్తీ చేయనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా, టీడీపీ జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం, బీజేపీకి మరో ఎమ్మెల్సీ స్థానం కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు తమ అభ్యర్థులను టీడీపీ తాజాగా ప్రకటించింది.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు:
1. బీదా రవిచంద్ర – నెల్లూరు జిల్లాకు చెందిన వీరు పార్టీకి మొదటి నుంచి విశ్వాసంగా సేవలందిస్తున్నారు.
2. కావలి గ్రీష్మ – శ్రీకాకుళంకు చెందిన గ్రీష్మ, మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె.
3. బీటీ నాయుడు – కర్నూలు జిల్లా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.
ఈ ముగ్గురిలో ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు.ఇక, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేశారు.