Tata Motors

Tata Motors: ఇవెకోకి టాటా మోటార్స్ భారీ ఆఫర్.. $4.5 బిలియన్ తో డీల్

Tata Motors: టాటా మోటార్స్ మరో బారీ అంతర్జాతీయ వ్యాపారానికి తెర తీసేలా ఉంది. ఇటలీలోని ప్రముఖ ట్రక్ తయారీ సంస్థ ఇవెకో (IVECO)ను సుమారు $4.5 బిలియన్ల (రూ. 3.9 బిలియన్లు)కు కొనుగోలు చేయడానికి టాటా సిద్ధంగా ఉంది.

ఇది టాటా గ్రూప్ చరిత్రలో రెండో అతిపెద్ద కొనుగోలు కాగా, ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్‌కు ఇదే అతి పెద్ద డీల్ అవుతుంది. గతంలో 2008లో టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను $2.3 బిలియన్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

డీల్‌లో ఏముంది?

  • టాటా మోటార్స్ IVECO సంస్థలోని ప్రధాన వాటా — 27.1% ను ఎక్సోర్ అనే ఇటాలియన్ కంపెనీ నుంచి కొనుగోలు చేయనుంది.

  • మిగతా చిన్న వాటాదారులను టెండర్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

  • అయితే, ఈ డీల్‌లో IVECO రక్షణ విభాగం (డిఫెన్స్ బిజినెస్) చేరదని స్పష్టం చేశారు. టాటా కేవలం వాణిజ్య వాహన వ్యాపారాన్ని మాత్రమే కొననుంది.

ఎందుకు ప్రత్యేకం?

IVECO కంపెనీకి యూరోప్, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. దీని 74% ఆదాయం యూరప్ నుంచే వస్తుంది. మరోవైపు, టాటా మోటార్స్ వాణిజ్య వాహన ఆదాయం ఎక్కువగా భారతదేశం నుంచే (90%) వస్తుంది. ఈ డీల్ వల్ల టాటాకు అంతర్జాతీయ మార్కెట్లలో పాగా వేసే అవకాశం ఉంటుంది.

గత అనుబంధాలు

IVECO పూర్వంలో Fiat బ్రాండ్‌కు సంబంధించినదే. Fiat సంస్థతో టాటాకు గతంలో భాగస్వామ్యం ఉంది. అదునుగా ఈ డీల్ సాధ్యమవుతోంది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా – ఆగ్నెల్లి కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉండటంతో, ఈ ఒప్పందానికి మద్దతు దొరికినట్టు తెలుస్తోంది.

ఎకనామిక్ ఎఫెక్ట్

ఇవెకో షేర్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 7.4% పెరిగాయి. ఇప్పుడు కంపెనీ విలువ $6.15 బిలియన్లకు చేరుకుంది.
ఈ డీల్ విజయవంతమైతే, టాటా మోటార్స్ వాణిజ్య వాహన వ్యాపారం రూ.75,000 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతమున్న మార్జిన్ సమస్యలు (EBIT మార్జిన్: టాటా – 9.1%, ఇవెకో – 5.6%)ను అధిగమించడం ఒక సవాలే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *