Tamilnadu:

Tamilnadu: న‌టుడు విజ‌య్‌కి షాక్‌! 20 ల‌క్ష‌ల చెక్కు తిరిగిచ్చిన ఓ కుటుంబం

Tamilnadu: న‌టుడు, టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్‌కి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే క‌రూర్ దుర్ఘ‌ట‌న‌తో కుంగిపోయిన ఆయ‌న‌కు ఇది మ‌రింత ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే. గ‌త నెల సెప్టెంబ‌ర్ 27న త‌మిళ‌నాడులోని క‌రూర‌ల్‌లో టీవీకే స‌భ‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 39 మంది మృతి చెందారు. ఆ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి కుటుంబాల‌కు ఆనాడే రూ.20 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

Tamilnadu: అనుకున్న మేర‌కు తాజాగా మృతుల‌ కుటుంబాల ఖాతాల్లో రూ.20 ల‌క్ష‌ల చొప్పున అక్టోబ‌ర్ 18న విజ‌య్ జ‌మ చేశారు. అయితే మృతుల్లో ఒక‌రైన ర‌మేశ్ భార్య సంఘ‌వి ఆ సొమ్మును తిప్పి పంపింది. దానికి ఆమె ఏమి కార‌ణం చెప్పిందంటే.. విజ‌య్ నేరుగా వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఓదారుస్తార‌ని వీడియో కాల్‌లో మాట్లాడార‌ని, ముందుగా ఆర్థిక సాయం తీసుకోవాల‌ని చెప్పార‌ని సంఘ‌వి తెలిపింది.

Tamilnadu: కానీ, త‌మ‌కు డ‌బ్బు ముఖ్యం కాద‌ని, తాము విజ‌య్ ప‌రామ‌ర్శ కోసం ఎదురుచూశామ‌ని సంఘ‌వి చెప్పారు. అందుకే త‌మ ఇష్టానికి భిన్నంగా త‌మ ఖాతాలో జ‌మ చేసిన ఆ రూ.20 లోల న‌గ‌దు మొత్తాన్ని తిరిగి ఆయ‌న‌కే పంపామని ఆమె తెలిపింది. ఇప్ప‌టికే ఘ‌ట‌న‌పై స‌రైన‌ విచార‌ణ జ‌ర‌గాల‌ని విజ‌య్ కోరుకుంటుండ‌గా, కుట్ర జ‌రిగిందేమోన‌ని అనుమానంతో స‌త‌మ‌తం అవుతుండ‌గా, న‌గ‌దు సాయాన్ని ఓ కుటుంబం తిప్పి పంప‌డంపై ఆయ‌నకు శ‌రాఘాత‌మేన‌ని భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *