Kingdom: విజయ్ దేవరకొండ చానాళ్ల తర్వాత కింగ్ డమ్ తో ట్రాక్ లోకి వచ్చాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో, సితార నాగ వంశీ ప్రొడ్యూస్ చేసిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి టాక్ తేడా వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. కట్ చేస్తే..ఇప్పుడు తమిళనాట విజయ్ మూవీ వివాదాస్పదంగా మారింది.. అక్కడ థియేటర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు తమిళ తంబీలు..
Also Read: Naa Peru Shiva: నా పేరు శివ మూవీకి 14 ఏళ్లు
విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసిన కింగ్ డమ్, జూలై 31న పాన్ ఇండియా స్థాయిలో.. రిలీజ్ అయింది.. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్, 82 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో కింగ్ డమ్ సినిమా థియేటర్ల ముందు.. కోయంబత్తూరు జిల్లాలో ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు… విలన్ క్యారెక్టర్ కు మురుగన్ అనే పేరు పెట్టడంతో పాటు స్క్రిప్ట్ లోని కొన్ని అంశాలపై తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. దీని గురించి మేకర్స్ స్పందించాల్సి ఉంది..