DADA: తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘డా… డా’ మూవీ ఇప్పుడు తెలుగులో ‘పా… పా…’ పేరుతో జనం ముందుకు రాబోతోంది. దీనిని డిసెంబర్ 13న నీరజ కోట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాను కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రధారులుగా గణేశ్ బాబు తెరకెక్కించారు. పరిమితమైన బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 30 కోట్ల వసూళ్లను సాధించింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కు ఈ సినిమాలో ప్రాధాన్యముందని దీన్ని తెలుగు రాష్ట్రాలలో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారని అన్నారు.

