Tamannaah: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. ఈ పాట కోసం తమన్నాను ఎంపిక చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: OG: మళ్లీ థియేటర్లలో ఓజీ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫుల్ కామెడీ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతుంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఇందులో స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేశారు. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. కమర్షియల్ అంశాలను పరిగణనలోకి తీసుకుని అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను చేర్చారు. చిరంజీవి ఇటీవల మాట్లాడుతూ ఈ చిత్రం పూర్తి వినోదాత్మకమని, అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తమన్నా టచ్ ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

