సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోటల్‌లో ఓ ఫ్యామిలీ సూసైడ్ కి ట్రై చేశారు.వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మధుర నగర్‌కు చెందిన తోట బవన్న తన భార్య పద్మావతి, కుమారుడు సుజన్‌తో కలిసి తాజ్ త్రీస్టార్ హోటల్‌లో నిన్న రాత్రి దిగారు. ముగ్గురు సూసైడ్ కి ట్రై చేయడంతో హోటల్ సిబ్బంది గమనించారు.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ముగ్గురిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.