SV Krishna Reddy: హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి 43వ చిత్రం వేదవ్యాస్ శుభారంభం జరిగింది. సాయిప్రగతి ఫిల్మ్స్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. దిల్ రాజు ఆమెను స్వాగతించగా, వీవీ వినాయక్ క్లాప్, అనిల్ రావిపూడి దర్శకత్వం, జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మురళీ మోహన్, అలీ, సాయికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మ్యాజిక్ తో ఈ చిత్రం కచ్చితంగా కొత్త ప్రయోగంగా నిలుస్తుందట. కృష్ణారెడ్డి గత విజయాల లాగా వేదవ్యాస్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని టాలీవుడ్ ఇండస్ట్రీ ఆకాంక్షిస్తోంది.

