Suriya: భార్య జ్యోతిక కోరిక మేరకు ఇప్పుడు సూర్య చెన్నయ్ నుండి ఇంటిని ముంబై కు షిఫ్ట్ చేశాడు. పిల్లల చదవులూ అక్కడే సాగుతున్నాయి. విశేషం ఏమంటే ఏ టైమ్ దొరికినా ముంబైలోని పలు ప్రాంతాలను నార్మల్ సిటిజన్ లా చుట్టేస్తున్నాడు సూర్య. ఇటీవల ఓ రెస్టారెంట్ లో అతను పావ్ బాజీ తింటుంటే అక్కడ ప్రత్యక్షమైన ఇంటర్వూయర్ సూర్యను ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. తానెక్కువ ఇంటి ఫుడ్ ను ఇష్టపడతానని దోసెలంటే ఇష్టమని సూర్య చెప్పాడు. అదే సమయంలో సమోసాను ఇష్టంగా తింటానని, రసం కంటే సాంబర్ నే ప్రిఫర్ చేస్తానని చెప్పాడు. షూటింగ్ టైమ్ లో రీటేక్ చేయడానికి తానెప్పుడూ మొహమాటపడనని తెలిపాడు. అలానే చాలా సందర్భాలలో ఎదుటి వారి పేర్లు మర్చిపోతుంటానని మనసులో మాట చెప్పేశాడు. రొమాంటిక్… యాక్షన్ చిత్రాలలో తన ఓటు యాక్షన్ సినిమాలకే అని, రొమాంటిక్ మూవీస్ చేసే టైమ్ దాటిపోయిందని సూర్య చెప్పడం విశేషం. అందుకే బహుశా సూర్య ‘కంగువ’ లాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడేమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ నెల 14న ‘కుంగవ’ జనం ముందుకు వస్తోంది.