Varun Tej: చోటా చోటా స్టార్స్ మాత్రమే కాదు బడా స్టార్స్ కూడా ఇప్పుడు హారర్ వెంట పడుతున్నారు. దానికి కారణం ఈ జోనర్ సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తుండటమే. దానికి నిదర్శనం ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ‘స్త్రీ2’. ఈ ఏడాది టాప్ బాలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమా. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రబాస్ సైతం ఈ జోనర్ వైపు ఆకర్షితుడై ‘ది రాజాసాబ్’ అనే హారర్ మూవీ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెత్ తో రూపొందుతోంది. ఇక లారెన్స్ అయితే ప్రత్యేకంగా ఈ జోనర్ ని నమ్మే సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య ఎదురు దెబ్బ తగిలినా మళ్ళీ ‘కాంచన4’తో ప్రయత్నం చేస్తున్నాడు. ఖుష్బూ భర్త సుందర్ సి కూడా ఇదే జోనర్ లో వరుస సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. మెగా హీరో సాయిధరమ్ కూడా ఆ మధ్య ఇదే జోనర్ లో ‘విరూపాక్ష’ చేసి వంద కోట్ల క్లబ్ లో చేరాడు.
Varun Tej: ఇదిలా ఉంటే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా హారర్ బాట పట్టాడట. ‘కొరియన్ కనకరాజు’ పేరుతో రాయలసీమ నేపథ్యంలో ఓ హారర్ మూవీ చేస్తున్నాడు వరుణ్ తేజ్. దీనికోసం రాయలసీమ శ్లాంగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట. అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మరి సాయి ధరమ్ తేజ్ లాగే వరుణ్ తేజ్ కూడా రాబోయే ‘మట్కా’తో పాటు తన తొలి హారర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరతాడేమో చూద్దాం.