Retro

Retro: రొమాన్స్ & యాక్షన్‌తో రెట్రో తెలుగు టీజర్ రిలీజ్

Retro: రీసెంట్ గా కంగువాతో దెబ్బ తిన్న సూర్య తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పైనే సూర్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తున్నప్పటికి.. ఇటివల రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ ‘రెట్రో’ సినిమాలో సూర్య వైవిధ్యమైన వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా, తాజాగా మూవీ టీం ‘రెట్రో’ తెలుగు టీజర్‌ ని కూడా విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే మంచి యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది. టీజర్ లో విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి, కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి. మొత్తానికి ఈ టీజర్ ‘రెట్రో’ పై అంచనాలు మరింత పెంచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *