Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 22న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభాకర్ రావు బెయిల్ తీర్పు ఆధారంగా సిట్ తదుపరి చర్యలు తీసుకోనుంది.
నెల రోజుల్లో అడిషనల్ ఛార్జిషీట్ దాఖలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే పలుమార్లు ప్రభాకర్‌రావును విచారించింది. ఇప్పటివరకు ఆయన్ని పదిసార్లు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో సిట్ మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల రోజుల్లో ఈ కేసుపై సిట్ అడిషనల్ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు, సిట్ దర్యాప్తు పురోగతి ఈ కేసులో కీలక మలుపులుగా మారనున్నాయి.