Supreme Court

Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్‌ తీర్పా? సుప్రీంకోర్టు షాక్

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, మాజీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్‌కు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏకంగా 49 పేజీలతో ఇచ్చిన ఈ తీర్పు చూసి, ముందస్తు బెయిల్ సమయంలోనే హైకోర్టు మొత్తం కేసును విచారించి, ఒక ‘మినీ ట్రయల్’ నిర్వహించినట్లుగా ఉందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంజయ్ అగ్నిమాపక దళం డీజీగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Also Read: Rahul Gandhi: ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి: రాహుల్ గాంధీ

జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ, అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చిందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. 49 పేజీల బెయిల్ తీర్పును చూసి ఆశ్చర్యపోయిన ధర్మాసనం, కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు (కాంట్రాక్ట్ డాక్యుమెంట్లు), ఇన్‌వాయిస్‌లను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ తీర్పుల విషయంలో న్యాయస్థానాలు ఎంతవరకు కేసు వివరాల్లోకి వెళ్లాలనే దానిపై ఈ కేసు ఒక కీలక మైలురాయిగా మారే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *