Air India Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రమాదంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి
ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను వేగవంతం చేయాలని, పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరింది. విమాన ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.