Thug Life: సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన కమల్ హాసన్, మణిరత్నం కాంబో చిత్రం ‘థగ్ లైఫ్’ రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు సృష్టించింది. అయితే, కర్ణాటకలో సినిమాను నిషేధించడంతో చిత్ర బృందం షాక్‌కు గురైంది. ఈ నిషేధంపై కమల్ హాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, సెన్సార్ పూర్తిచేసిన చిత్రం రిలీజ్‌ను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వం సినిమా రిలీజ్‌కు అనుమతించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్‌కు అడ్డంకులు తొలగాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ రిలీజ్ తేదీని ఖరారు చేసే పనిలో ఉంది. మరోవైపు, సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ బాక్సాఫీస్ విజయంపై ఉత్కంఠ రేపుతోంది.
