Supreme Court: ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల వినియోగంపై కేరళ హైకోర్టు విధించిన పలు ఆంక్షలపై సుప్రీంకోర్టు నిన్న స్టే విధించింది.కేరళలో ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏనుగులకు ఇరిటేషన్ వచ్చి ఇటీవల కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ వేడుకల్లో ఏనుగుల వినియోగంపై కేరళ హైకోర్టు పలు ఆంక్షలు విధించింది.
Supreme Court: ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించేటప్పుడు ఒక ఏనుగుకు మరో ఏనుగుకు మధ్య 10 అడుగుల దూరం ఉండాలి, ఏనుగులను బహిరంగ ప్రదేశాలకు కనీసం 25 అడుగుల దూరంలో ఉంచాలి, బాణాసంచా పేల్చే ప్రదేశానికి ఏనుగులను 320 అడుగుల దూరంలో ఉంచాలి. ఏనుగులకు కనీసం మూడు రోజుల విశ్రాంతి ఇవ్వాలి, ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించడం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదు అంటూ కేరళ హైకోర్టు ఆంక్షలు విధిస్తూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: KTR: ఏసీబీ కేసు.. హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
Supreme Court: ప్రముఖ త్రిసూర్ పూరం ఉత్సవాలను నిర్వహించే తిరువంబాడి, పారమెక్కవు దేవసం బోర్డులు ఈ ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ‘కేరళ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అసాధ్యమని’ పేర్కొంది.
Supreme Court: “అంతేకాకుండా, నిబంధనలను రూపొందించే అధికారం కోర్టుకు లేదని – ఆ ప్రయోజనం కోసం ప్రత్యేక అధికారాలు కలిగిన అధికారులు ఉన్నారని పేర్కొంది.” దీనిని అనుసరించి, కేరళ హైకోర్టు ఆంక్షలను కొట్టివేసింది కేరళ రూల్స్, 2012లోని క్యాప్టివ్ ఏనుగుల నిర్వహణ, సంరక్షణ కింద ఆలయ ఉత్సవాల్లో వాటిని ఉపయోగించడానికి అనుమతించింది.

