Renukaswamy Murder Case

Renukaswamy Murder Case: నటుడు దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు..

Renukaswamy Murder Case: కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టు గురువారం (ఆగస్టు 14, 2025) భారీ షాక్ ఇచ్చింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ మాట్లాడుతూ .. 

“బెయిల్ మంజూరు, బెయిల్ రద్దు — రెండు అంశాలను పరిశీలించాం. హైకోర్టు ఉత్తర్వు యాంత్రికంగా ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన కేసులో ఇలాంటి బెయిల్ విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాక్షులను కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉంది” అని స్పష్టం చేశారు.

బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పార్దీవాలా వ్యాఖ్యానిస్తూ .. 

“నిందితులు ఎంతటి వారు అయినా, చట్టానికి అతీతులు కారు. ఇది సమాజానికి స్పష్టమైన సందేశం” అని అన్నారు.

కేసు నేపథ్యం

పోలీసుల ప్రకారం, రేణుకాస్వామి – దర్శన్‌ అభిమానిగా ఉండేవాడు. అతడు నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, 2024 జూన్‌లో దర్శన్‌ మరియు అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని ఒక షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారని, అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్నప్పుడు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే విమర్శలతో, దర్శన్‌ను మరో జైలుకు మార్చారు.

కేసు టైమ్‌లైన్‌

  • 2024 జూన్ 8: రేణుకాస్వామి హత్య, కాలువలో మృతదేహం కనుగొనడం

  • 2024 జూన్ 11: దర్శన్ అరెస్ట్

  • 2024 అక్టోబర్ 31: హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు

  • 2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు

  • 2025 జనవరి 24: బెయిల్ రద్దు కోరుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్

  • 2025 ఆగస్టు 14: సుప్రీంకోర్టు బెయిల్ రద్దు

మళ్ళీ అరెస్ట్‌కు అవకాశం

సుప్రీంకోర్టు తీర్పుతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు స్పష్టం చేసినట్లుగా, బలమైన ఆరోపణలు మరియు ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నప్పుడు, దర్యాప్తు పూర్తి కాకముందే బెయిల్ ఇవ్వడం సరైనది కాదని అభిప్రాయపడింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tollywood: ముగిసిన సినీ కార్మికుల సమ్మె.. నేటి నుంచి షూటింగులు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *