Super star Rajinikanth

Super star Rajinikanth: మళ్ళీ షూటింగ్ కు సూపర్ స్టార్!

Super star Rajinikanth: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగి యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. ఆయన ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ భారీ షెడ్యూల్ ఒకటి వైజాగ్ లో జరిగింది. ఇటు ‘వేట్టయాన్’ మూవీ విడుదల హడావుడి, మరో వైపు ‘కూలీ’ షూటింగ్… ఈ మధ్యలో రజనీ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. శస్త్ర చికిత్స అవసరం లేకుండా రక్తనాళాలలోని బ్లాక్స్ ను తొలగించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని సూచన చేశారు. ఆ మేరకు కొద్ది రోజులు షూటింగ్ కు విరామం ప్రకటించిన రజనీ కాంత్ ఇప్పుడు ‘కూలీ’ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చెన్నయ్ లో వేసిన సెట్ లో చిత్రీకరణ జరుగబోతోంది. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ అతిధి పాత్రలో మెరియబోతున్నాడట. ‘కూలీ’ సినిమాను లోకేశ్‌ కనకరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ‘వెట్టయాన్’కు సంగీతం అందించిన అనిరుధ్ దీనికీ మ్యూజిక్ ఇస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *