Identity: అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులు కల్లప్పగించి చూసే విధంగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఐడెంటిటీ చిత్ర ట్రైలర్ లంచ్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఈ చిత్రం మలయాళంలో జనవరి 2వ తేదీన విడుదలై ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి ఇక్కడ సినిమాలు ఉండటంవల్ల అదే సమయంలో విడుదల చేయలేకపోయాము. అందుకే ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాము. ఈ చిత్రంలో మన తెలుగువారి కొడుకుని యాక్షన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం మలయాళంలో బాగా ప్రేక్షకుల మరణ పొందడంతో తెలుగులో కూడా ఈ చిత్రం అలాగే ఉంటుందని ఎన్నో అంచనాలు ఉన్నాయి. అనుకొని కారణాలవల్ల హీరో టోవినో థామస్, హీరోయిన్ త్రిష ఈ వేడుకకు రాలేకపోయారు. దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతుంది. ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. దర్శకులు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది” అన్నారు.
చింతపల్లి రామారావు గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారికి, స్నేహితులకి, సన్నిహితులకి అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో సంచలన వసూలతో గొప్ప విజయం సాధించింది ఐడెంటిటీ సినిమా. మామిడాల శ్రీనివాసరావు గారితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాము. ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ సుపరిచితులు కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా దర్శకులకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాము. జనవరి 24వ తేదీన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. యాక్షన్ త్రిలరైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా వినోదపరుస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.
తారాగణం: టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి తదితరులు.
సాంకేతిక బృందం :
రచన దర్శకత్వం : అఖిల్ పాల్, అనాస్ ఖాన్
నిర్మాతలు : రాజు మల్లియాత్, రాయ్ సిజె
సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్
ఎడిటర్ : చామన్ చక్కో
సంగీతం : జేక్స్ బెజోయ్
సమర్పణ : మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల
తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ : శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం