AP Nominated Posts: గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14నియోజకవర్గాలుగాను 12నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే చాలామంది వరకు సీనియర్లు జూనియర్లు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు పార్టీలో రాజకీయ అనుభవంతో పాటు వారికున్న ప్రజా మద్దతును పరిగణనలోకి తీసుకుంటారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాంటివి పట్టించుకోకుండా జూనియర్లకు అలాగే సీనియర్ల మద్దతు కూడినవారికి నామినేటెడ్ పదవులలో అంటగట్టారు.
దీంతో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవులలో ఆశపడి భంగపడ్డారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. అందులో కర్నూలు జిల్లాకు పెద్దపీట వేశారు. రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన చంద్రబాబు 9నామినేట్ పోస్టులో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు మూడో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోమొదటి రెండు విడతల్లో పోస్టు దక్కని నాయకులందరూ ఆశలు పెట్టుకున్నారు.
AP Nominated Posts: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల సమయం గడిచిపోయింది. అధికారంలోకి రాగానే మొదటి, రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి మూడో విడత పోస్టులను భర్తీ చేయడానికి కొంత సమయం తీసుకుంది. దీంతో కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తిని నిలువరించేందుకు నామినేట్ పోస్టుల భర్తీని కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం. అందులోభాగంగా మూడో విడత నామినేటెడ్ పోస్టులకు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో మార్కెట్ యాడ్ చైర్మన్‌లతో పాటు కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు జిల్లాలోని దాదాపుగా 14 మార్కెట్ కమిటీ చైర్మన్‌ల నియామకాన్ని కూడా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మూడో విడతపైన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇదే సమయంలో గత రెండు విడతల్లో పోస్టులు దక్కించుకున్న వారికి వేతనాలు ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం.
ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి మూడో విడత జాబితాపైన పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ లిస్టుపైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి మాడోవ విడతలో ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. మూడో లిస్టులో రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలతో పాటు కీలకమైన ఆర్.టి.ఐ చైర్మన్లు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లు, ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్, డిజిటల్ కార్పొరేషన్‌తో సహా పలు సంస్థలు డైరెక్టర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ పోస్టులతో పాటు జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ, మార్కెట్ యార్డ్ చైర్మన్‌లను భర్తీ చేయనున్నారు. దీంతో రాష్ట్ర పోస్టులతో పాటు జిల్లా పోస్టులలో కూడా పదవులను దక్కించేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.
AP Nominated Posts: ఉమ్మడి కర్నూలు జిల్లాకు విషయానికి వస్తే ఇప్పటికే నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రధాన కార్యకర్తలకు పదవులు లభించాయి. నంద్యాలకు జిల్లాకు చెందిన మౌలానా ముస్తఫా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అలాగే నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం ఇచ్చారు . డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన ధర్మవరం సుబ్బారెడ్డికి రాష్ట్ర idc చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డికి రాష్ట్ర మార్క్ ఫెయిఢ్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. ఇలా ఉమ్మడి జిల్లాల పార్టీ కోసం గత ఐదు సంవత్సరాలుగా కష్టపడిన ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తించి నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఉన్నారు. ప్రధానంగా శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవితో పాటు మహానంది దేవస్థానం కమిటీ చైర్మన్‌తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్‌లను సహకార బ్యాంకు చైర్మన్ పదవికి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇకకర్నూలు జిల్లాలో కూడా పలు పోస్టుల కోసం ఆశావహులు ఉన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.