Sunil Gavaskar: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన ‘హ్యాండ్‌షేక్’ వివాదంపై పాకిస్తాన్ బోర్డు, ఆ జట్టు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా మీడియాకు సంబంధించి వారి నిర్లక్ష్యంపై గవాస్కర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవాస్కర్ ప్రధానంగా రెండు విషయాలపై మండిపడ్డారు:
‘హ్యాండ్‌షేక్’ వివాదం: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), ఐసీసీ (ICC)లకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన గవాస్కర్, కరచాలనం చేయడం అనేది క్రికెట్ నియమావళిలో భాగం కాదని, ఇది కేవలం క్రీడా స్ఫూర్తిలో భాగమైన స్నేహపూర్వక సంప్రదాయం మాత్రమేనని పేర్కొన్నారు. దీనిపై పదే పదే ఫిర్యాదులు చేయడం అర్థరహితమని అన్నారు.
ఇది కూడా చదవండి: Tirumala Brahmotsavam 2025: నేటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
మీడియా బాధ్యతలపై నిర్లక్ష్యం: మ్యాచ్‌ల తర్వాత మీడియా సమావేశాలకు పాకిస్తాన్ జట్టు హాజరుకావడం లేదని, దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశారు. మ్యాచ్ తర్వాత మీడియా ముందుకు రావడం, కెప్టెన్ లేదా కోచ్ మాట్లాడటం కచ్చితంగా పాటించాల్సిన నిబంధన అని, పాకిస్తాన్ జట్టు ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఐసీసీ ఈ విషయాన్ని పట్టించుకోకపోతే, భవిష్యత్తులో మిగిలిన జట్లు కూడా ఇదే తీరును అనుసరించే అవకాశం ఉందని హెచ్చరించారు. కచ్చితంగా పాటించాల్సిన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్న పాకిస్తాన్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని గవాస్కర్ కోరారు.