Sukku-ShahRukh: గత రెండు మూడు రోజులుగా నెట్టింట ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పుష్ప2 సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన సుకుమార్ రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు ఓ కథ చెప్పాడని, ఆ కథకు షారుఖ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని వార్తలు జోరుగా వినిపించాయి.అక్కడితో అయిపోలేదు. హిందీ మీడియా వర్గాల్లో కూడా ఈ వార్త బాగా ప్రచారమైంది. రీసెంట్ గా పుష్ప2 తో భారీ హిట్ అందుకున్న సుకుమార్ తర్వాతి సినిమాను రామ్ చరణ్ తో చేయాల్సి ఉంది. చరణ్ మూవీ తర్వాత పుష్ప3 చేసే ఛాన్సుంది. ఈ రెండింటి మధ్యలో షారుఖ్ సినిమా ఉండొచ్చని కూడా అన్నారు.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సుకుమార్ సన్నిహితులు చెప్తున్నారు. అసలు సుకుమార్, షారుఖ్ మధ్య ఎలాంటి మీటింగ్ జరగలేదని, ఈ మధ్య కాలంలో సుక్కూ ముంబైకే వెళ్లలేదని వారంటున్నారు. కాబట్టి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
