Suicide

Suicide: ఉదయం అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్‌..సాయంత్రం సూసైడ్!

Suicide: ఒక్కోసారి ..ఒకలా ఉంటూనే మనం చూసేది ఏదైనా. అందులో తప్పు ఉందా కరెక్ట్ ఉందా అని తెలియడానికి కాస్త సమయం పడుతుంది. కానీ..ఈ గ్యాప్ లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మరి దీనికి కారణం ఎవరు ? సమాధానం ఎవరి వద్ద ఉండదు. కానీ..ఒకటి ఐతే నిజం. ఆ అనుమానం అనే రోగం ఒక్కసారి ..మైండ్ లోకి వస్తే ..ఆ సమయంలో కరెక్ట్ అయినా తప్పుగానే కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఇక్కడ ఒక ఆత్మహత్య జరిగింది.

Suicide: కొత్త సంవత్సరం అనగానే.. స్కూళ్లలో పిల్లలంతా గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు పంచుకుని న్యూఇయర్ విషెస్ చెప్పుకుంటుంటారు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా తమ స్నేహితులకు, తోటి ఉద్యోగులకు, బంధువులకు, ఇరుగుపొరుగువారికి ఇలా తెలిసివాళ్లకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తుంటారు. అయితే.. గతంలో గ్రీటింగ్ కార్డుల సంప్రదాయం ఉండేది కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం గట్టిగా ఉండటంతో.. అందరూ వాట్సప్ స్టేటస్‌లు, మెస్సేజుల ద్వారా విషేస్ చెప్తున్నారు.ఇలా ఓ పదో తరగతి విద్యార్థి.. తన క్లాస్‌మెట్ అమ్మాయికి న్యూఇయర్ విషెస్ చెప్పాడు. కట్ చేస్తే.. ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇంతకు.. విషెస్ చెప్పిన తర్వాత.. ఆత్మహత్యకు ముందు మధ్యలో ఏం జరిగింది..?

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: లైవ్ లో కవిత పై మంత్రి పొన్నం ఫైర్

Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన సాయి కిషోర్ అనే పదో తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. స్కూల్‌కు సెలవు ప్రకటించటంతో.. శివ నేరుగా అమ్మాయి ఇంటికి వెళ్లి మరీ న్యూఇయర్ విషెస్ చెప్పాడు. స్పెషల్‌గా అమ్మాయి ఇంటికి వెళ్లి విషెస్ చెప్పటాన్ని తప్పుగా అర్థం చేసుకున్న.. అమ్మాయికి విషెస్ చెప్తావా అంటూ.. విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు అబ్బాయిపై దాడి చేశారు.

Suicide: అందరి ముందు తనను కొట్టటమే కాకుండా తన తల్లికి కూడా అమ్మాయి బంధువులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. సాయి కిషోర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అమ్మాయి ముందే కాదు.. అక్కడున్న స్థానికుల ముందు తన పరువు పోయిందని.. తనను కొట్టిన విషయం స్కూల్‌లో అందరికీ తెలుస్తుందని.. తర్వాత తన ముఖం కూడా ఎత్తుకోలేనని భావించి.. సాయి కిషోర్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Suicide: సాయి కిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. అమ్మాయి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సాయి కిషోర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని.. అందుకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ  Crime News: కడియంలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం..

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *