Allu Arjun Bail: అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు.. షరతులు వర్తిస్తాయి !

Allu Arjun Bail: సినీ హీరో అల్లు అర్జున్ కు భారీ ఉపశమనం లభించింది. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రెండు పూచీకత్తులు , 50 వేల రూపాయల బాండ్ సమర్పించాలని కోర్టు పేర్కొంది. సంధ్య థియేటర్ కేసులో ఏ 11 గా ఉన్న అల్లు అర్జున్ ను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు .  నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది .  దీంతో అల్లు అర్జున్ ను చంచల్ గుడా జైలుకు తరలించారు. అయితే,  ఆ తరువాత హై  కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదల చేశారు. ఈ కేసు విషయమై అల్లు అర్జున్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు .  దీంతో విచారణ జరిపిన కోర్టు ఈరోజు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

అయితే ,  బెయిల్ మంజూరు సందర్భంగా సాహారతులు విధించింది కోర్టు. సాక్షులను ప్రభావితం చేయవద్దన్న న్యాయస్థానం.. ఎక్కడా కూడా కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొంది .  అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాలంటూ షరతు విధించింది నాంపల్లి కోర్టు .

Allu Arjun Bail: పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది .  ఆమె కుమారుడు కోమాలోకి జారిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో అభిమానులతో చూడడం కోసం అల్లు అర్జున్ వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు .  థియేటర్ లో సినిమా చూస్తున్న సమయంలో ఆయనను చూడాలని అభిమానులు ఉరకలు వేశారు .  ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో సినిమా చూడటానికి వచ్చిన రేవతి ,  ఆమె కొడుకు ఇరుక్కుపోయారు .  ఊపిరి ఆడక రేవతి మరణించింది.

Allu Arjun Bail: అల్లు అర్జున్ పోలీసులు చెప్పినా వినకుండా సంధ్య థియేటర్ కు వచ్చారని . . ఆ సమయంలో ఆయన పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా రోడ్ షో నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు ,  అల్లు అర్జున్ మరికొందరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ . . జైలుకు వెళ్లడం వరుసగా జరిగిపోయాయి .  ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది .  ప్రభుత్వం vs టాలీవుడ్ లా పరిస్థితి మారిపోయింది.

ALSO READ  Chandrababu Naidu: చిన్నారి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై స్పందించిన‌ సీఎం చంద్ర‌బాబు

Allu Arjun Bail: పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ ,  అల్లు అర్జున్ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారు .  ఇప్పుడు ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ రావడం ఆయనకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు .

ఈ వార్త అప్ డేట్ అవుతోంది . .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *