Suhas: ఓ భామ అయ్యో రామ సినిమా ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఆకట్టుకుంటోంది. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా.. సినిమా నేపథ్యంలో రూపొందింది. హరీష్ శంకర్, మారుతి కామియోలు చిత్రానికి మరింత ఆసక్తిని తెచ్చాయి. రధన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హరీష్ నల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజువల్స్, సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Also Read: Venkatesh: వెంకటేష్, త్రివిక్రమ్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్?
Suhas: ట్రైలర్ పూర్తిగా ఫీల్ గుడ్, ఫన్నీ రొమాంటిక్ కామెడీ టచ్‌లో సాగుతుంది. హీరో సుహాస్, హీరోయిన్ మాలవిక మనోజ్ మధ్య లవ్-హేట్ కెమిస్ట్రీ, చిలిపి మాటలు ట్రైలర్‌కు స్పెషల్ హైలైట్ గా నిలిచాయి. వి ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జూలై 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు వినోదభరిత అనుభవాన్ని అందించనుంది.