Sudarshan Reddy: రాజకీయాలు ముళ్ళ కిరీటాలు

Sudarshan Reddy: రాజకీయాలను ముళ్ల కిరీటంతో పోలుస్తూ సుదర్శన్‌ రెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?” అని చాలామంది అడుగుతున్నప్పటికీ తాను రాజకీయాల్లోకి ప్రవేశించలేదని ఆయన స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి కూడా సభ్యత్వం తీసుకోలేదని, ఇక ముందు కూడా సభ్యత్వం తీసుకోబోనని స్పష్టంగా ప్రకటించారు.

తన లక్ష్యం రాజకీయ పదవులు కాదు, ప్రజల హక్కుల కోసం పనిచేయడమేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పౌరహక్కులు, సామాజిక న్యాయం కోసం ఎప్పుడూ మాట్లాడతానని, ఆ దిశగా కృషి చేస్తానని చెప్పారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడం, సమానత్వం కోసం పోరాడటం తన ప్రధాన ధ్యేయమని సుదర్శన్‌ రెడ్డి అన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *