Nuzvid IIIT

Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం: ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి

Nuzvid IIIT: ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంటెక్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థి వినయ్ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.ఎస్.వి. గోపాల్ రాజుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వినయ్ పురుషోత్తం క్లాసులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో, ప్రొఫెసర్ గోపాల్ రాజు అతడిని ల్యాబ్ ఎగ్జామ్ రాయకుండా నిషేధించారు. ఎగ్జామ్‌కు అనుమతి కావాలంటే హెచ్‌ఓడీ (విభాగాధిపతి) అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై ఆగ్రహించిన వినయ్, కిచెన్ రూమ్ నుంచి రెండు కత్తులు తీసుకొని ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడ్డాడు.

Also Read: Zelensky: భారత్‌పై ఆంక్షలు విధించడంలో తప్పులేదు.. ట్రంప్ కి ఉక్రెయిన్ అధ్యక్షుడు సపోర్ట్..

దాడి సమయంలో తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో ప్రొఫెసర్ గోపాల్ రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని గోపాల్ రాజు తెలిపారు. గాయపడిన ప్రొఫెసర్‌ను మెరుగైన చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారని, దాడి వెనుక ఉద్దేశాలను విచారిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో భయాందోళనలను రేకెత్తించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *