Stranger Things 5: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్–5కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. విడుదలైన తొలి నాలుగు ఎపిసోడ్లు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని స్థాయిలో వ్యూస్ సాధించి మేకర్స్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. కేవలం ఒక వారంలోనే 59.6 మిలియన్ వ్యూస్ నమోదు కావడం ఈ సీజన్‌కు వచ్చిన ప్రజాదరణను చూపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యను అందుకున్న మొదటి ఇంగ్లీష్ సిరీస్‌గా స్ట్రేంజర్ థింగ్స్–5 రికార్డుల్లోకి దూసుకెళ్లింది.
డఫెర్ బ్రదర్స్ రూపొందించిన ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. హాకిన్స్ పట్టణం చుట్టూ తిరిగే రహస్యాలు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సీజన్లో మరింత ఉత్కంఠను తెచ్చాయి. కొత్త సీజన్ స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో ఉంచే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చలు పెరిగాయి.
Also Read: Samantha: సమంత కొత్త జీవితం: అత్తవారింట్లో గ్రాండ్ వెల్కమ్
నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఇంతకుముందు ఏ ఇంగ్లీష్ సిరీస్‌కు ఒక వారంలో ఇలాంటి భారీ వ్యూస్ రావడం జరగలేదని స్పష్టం చేసింది. దీంతో సీజన్–5 మొదటి వాల్యూమ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసినట్లైంది.
ఇకపై వస్తున్న ఎపిసోడ్లపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సీజన్ రెండో వాల్యూమ్ డిసెంబర్ నెలలో విడుదల కానుండగా, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను నెట్‌ఫ్లిక్స్ కొత్త సంవత్సరం కానుకగా ప్రేక్షకులకు అందించనుంది. హాకిన్స్ పట్టణంలోని మిస్టీరియస్ ఘటనలు, పాత్రల ప్రయాణం, ఇంకా ఎలాంటి ట్విస్ట్‌లు ఎదురవుతాయనే ఆసక్తి పెరుగుతోంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్–5 ఈ రెస్పాన్స్‌ను బట్టి చూస్తే… ఈ ఏడాది అత్యంత పెద్ద ఓటీటీ సక్సెస్‌గా నిలవడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Stranger Things 5 is the #1 SHOW IN THE WORLD
With 59.6 million views, it also boasts the biggest premiere week ever for an English language show in the history of Netflix. pic.twitter.com/CapAJMWSin
— Netflix (@netflix) December 2, 2025

