Eluru: దీపావళి పండగ పూట ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకోని వెళ్తూవుండగా తూర్పు వీధి గౌరీ దేవీ గుడి వద్ద వున్నా గుంత లో బండి పడటంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడటంతో పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా బైక్ పైన బస్తా పట్టుకొని వున్నా వ్యక్తి శరీరభాగాలు తెగిపడిపోయాయి. అతను అక్కడే మృతి చెందగా. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించార. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ వాసులారా! దీపావళి బాణసంచా కాలుస్తున్నారా? బీ కేర్‌ఫుల్